Header Banner

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

  Tue May 06, 2025 12:36        Politics

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ జ్యుడీషియల్ రిమాండ్‌ను విజయవాడ కోర్టు మరోసారి పొడిగించింది. వంశీతో పాటు కేసులో అరెస్టయిన మిగిలిన నిందితుల రిమాండ్‌ను కూడా ఈ నెల 13వ తేదీ వరకు పొడిగిస్తూ విజయవాడ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కిడ్నాప్ కేసులో వంశీని ప్రధాన నిందితుడిగా (ఏ1)గా పేర్కొంటూ పోలీసులు ఫిబ్రవరి 13, 2025న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బాధితుడు ఎం. సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల ఆరోపణలపై వంశీపై కేసు నమోదైంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో అక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన దళిత యువకుడు సత్యవర్ధన్‌ను వంశీ, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని ఆరోపణలున్నాయి. కిడ్నాప్ సమయంలో సత్యవర్థన్‌ను హైదరాబాద్, విశాఖపట్నం మధ్య తిప్పినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీతో ఈ కేసు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిబ్రవరి 13న వంశీ అనుచరులు సత్యవర్ధన్‌ను కారులో కోర్టుకు తీసుకెళ్తున్న దృశ్యాలు కేసు నమోదుకు కీలకంగా మారాయి. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరిలో వెంకట శివరామకృష్ణ (ఏ7), నిమ్మ లక్ష్మీపతి (ఏ8) కూడా ఉన్నారు. కాగా, వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VallabhaneniVamsi #TDPOffice #Attck #YSRCP #Arrest #Hyderabad